Events

పినాకిని సత్యగ్రహ గాంధీ ఆశ్రమం లో కస్తూరిబా గాంధీ వర్ధంతి సభ

పినాకిని సత్యగ్రహ గాంధీ ఆశ్రమం లో జరిగిన కస్తూరిబా గాంధీ వర్ధంతి సభ లో నెల్లూరు రెడ్ క్రాస్ కన్వినర్ Dr. A.V. సుబ్రహ్మణ్యం గారు మరియు  ఆశ్రమ కాన్వినర్ G. కృష్ణ రెడ్డి  గాంధీ  మరియు కస్తురిబా గాంధీ పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు,  శివరామయ్య గారు భజన కార్యక్రమం నిర్వహించారు . T . సుకుమార్ రెడ్డి కస్తురిబా గాంధీ గురించి వివరిస్తూ ఈమె గాంధీ సహదర్మచారినిగానే  కాకుండా ఒక స్వతంత్ర సమరయోధురాలిగా పలుమార్లు జైలుకు వెళ్లిన మహనీయురాలు అని కొనియాడినారు. కస్తూరిబాయి గాంధీ తన భర్తతో కలిసి రాజకీయ నిరసన కార్యక్రమములలో పాల్గొంది. తన భర్తతో కలిసి ఉండటానికి 1897లో ఆమె దక్షిణాఫ్రికా వెళ్ళింది. 1904 నుండి 1914 వరకు ఆమె డర్బన్ సమీపంలోని ఫీనిక్స్ సెటిల్మెంట్ లో చురుకుగా పాల్గొంది. దక్షిణాఫ్రికాలోని భారతీయుల ఉద్యోగ పరిస్థితులకు వ్యతిరేకంగా 1913లో జరిగిన నిరసన సమయంలో, కస్తూరిబాయి అరెస్టు అయింది మరియు ఆమెకు మూడు నెలలు కఠిన కారాగార శిక్ష విధించబడింది. తరువాత, భారతదేశంలో తన భర్త జైలులో ఉన్న సమయంలో ఆమె కొన్నిసార్లు తన భర్త స్థానంలో పనిచేసింది. 1915లో, నీలిరంగును ఉత్పత్తి చేసే మొక్కలను పెంచే వారికి అండగా నిలవటానికి గాంధీ భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు, కస్తూరిబాయి ఆయనతో పాటు వచ్చింది. స్త్రీలు మరియు పిల్లలకు ఆమె పరిశుభ్రత, క్రమశిక్షణ, చదవటం మరియు వ్రాయటం నేర్పించింది పూనా (ప్రస్తుతం పూణే)లో జైలులో ఉండగానే గాంధీ చేతులలో ఆమె మరణించింది అగా ఖాన్ పాలెస్, పూణేలో ఆమె మరణించిన చోట మహదేవ్ దేశాయ్ యొక్క జ్ఞాపక శిలతో పాటు కస్తూరిబాయి గాంధీ జ్ఞాపక శిల (కుడివైపున ఉన్నది).
ఈ కార్యక్రమం లో రెడ్ క్రాస్ కమిటి మెంబెర్ బాస్కర్ , ఆశ్రమ మెంబెర్ నేదురుమల్లి సుబ్బారెడ్డి, నారాయణ, లక్ష్మయ్య ,యశ్వంత్  ఆశ్రమం మనేజేర్ శివ , పల్లిపాడు గ్రామా యువకులు విద్యార్ధులు పాల్గొన్నారు

Gallery Of పినాకిని సత్యగ